Kalyana Lakshmi | ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించినవాడు మనసున్న మనిషి! దాన్ని తీర్చాలని తాపత్రయపడేవాడు నిజమైన నాయకుడు!! ఆ కష్టం ఇంకెవరికీ రాకూడదని ఆలోచించేవాడూ.. దాన్ని ఆచరణలో చూపేవాడూ.. జనం గుండెల్లో నిలిచిపోతాడు. అచ్చంగా ఇలాంటి లక్షణాలే కేసీఆర్‌ను ప్రజల మనిషిని చేశాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ చూసిన ఓ తండ్రి కష్టం, ఒక ఆడపిల్ల కన్నీరు.. ఆయన మనసును ద్రవింపజేశాయి. లక్షల మంది ఆడబిడ్డలను కల్యాణలక్ష్ములుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయించాయి. రాష్ట్రం రాకముందే ఆయన చేతుల మీదుగా కల్యాణలక్ష్మి కానుక అందుకున్న కల్పన, లునావత్ నాయక్ దంపతులు, కల్పన తండ్రి బానోతు కీమా.. నాటి-నేటి సంగతులను నమస్తే తెలంగాణతో పంచుకున్నారిలా…
నా పేరు బానోత్ కీమా. మాది ములుగు జిల్లా గుత్తూరు తండా. 2002లో మా ఊళ్లో అగ్నిప్రమాదం జరిగింది. మాది పూరిల్లు. ఆ ప్రమాదంలో కాలిపోయిన ఇండ్లలో మాదీ ఉంది. ఇంటితోపాటు మా అమ్మాయి పెండ్లి కోసం దాచుకున్న 50 వేల రూపాయలు, బంగారం నగలు కాలి బూడిదైపోయాయి. అది చూసి నా గుండె పగిలిపోయింది. దగ్గర్లోనే పెండ్లి ఉంది. నాకా సదువు రాదు. ఎవుసం చేసుకుంటా. అలాంటి నేను అప్పటికప్పుడు అంత డబ్బు ఏడ్నుంచి తేవాలి.. అని అర్థంకాక బోరున ఏడుస్తూ కూర్చున్నా. ప్రమాదం గురించి తెలుసుకున్న కేసీఆర్ సార్, మా ఊరికి వచ్చిండు. నన్ను చూసి ‘నీకొచ్చిన ఆపతేంది..’ అని అడిగిండు. సంగతి సెప్పిన. ‘రందివడకు నీ బిడ్డ పెండ్లి నేను జేస్త…’ అని ధైర్యం చెప్పిండు. అన్నట్టే గుర్తు పెట్టుకుని పెండ్లికి యాభైవేల నూట పదహార్లు ఇచ్చిండు. అంతేకాదు, బిడ్డ పెండ్లికొచ్చి ఆశీర్వదించిండు. ‘మరి పెండ్లికి డబ్బులు నీ బిడ్డకిస్తే చాలా… మీ వాళ్లందరికీ ఇయ్యాలా…’ అని అప్పుడే నన్ను కేసీఆర్ సార్ అడిగిండు. ‘మావోల్లంత పేదోళ్లే… అందరికీ ఇయ్యండి సారూ…’ అన్న. ‘తప్పకుండా, ఆడబిడ్డలందరికీ సాయం చేద్దాం…’ అని ఆనాడే అన్నడు. మా ఊరు అనే కాదు, రాష్ట్రం వచ్చాక గుర్తు పెట్టుకుని నా బిడ్డలాంటి ప్రతి ఆడపిల్ల పెండ్లికీ సాయం జేస్తున్నడు సారు. నిజంగానే ఇప్పుడు మా ఊళ్ల అందరికీ సార్ సాయం అందింది. ఇప్పుడు నన్ను అందరు తెలంగాణ కీమా… అని ఆప్యాయంగా పిలుస్తున్నరు.
కేసీఆర్ సార్… కల్యాణలక్ష్మి పథకం గురించి చెప్తున్నప్పుడు గుర్తుచేసుకునే కల్పనను నేనే! అది నాకు సంతోషం అనిపిస్తది. నా పెండ్లికి డబ్బులిచ్చిన ఆయన, ఆ తర్వాత నాలాంటి పేద ఆడపిల్లలందరికీ ఇవ్వాలని అనుకున్నరు. ఇరవై ఏండ్ల కిందట నా పెండ్లికి ముందు జరిగిన ఆ ప్రమాదం నా కండ్ల ముందు ఇంకా ఉన్నది. నాన్న, అమ్మ (రుక్కమ్మ) కష్టపడి పనిజేస్తరు. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడున్నడు. నా పెండ్లి కుదిరింది. శ్రీరామనవమి రాములోరి పెండ్లయినాంక ముహూర్తం పెట్టిన్రు. పెండ్లికని యాభై వేల రూపాయలు, కొన్ని నగలు, బట్టలు తెచ్చి ఇంట్లనే దాచినం. ఆ రోజు అమ్మానాన్న ఊళ్ల లేరు. రాత్రి కొన్ని ఇండ్లకు మంటలు అంటుకున్నయి. గాలి ఇసరడంతో మంటలు పెరిగినయ్. భయంతోని మేం మా అమ్మమ్మ ఇంట్లకు పోయినం. చూస్తుండగనే పైసలు, బంగారం, బోళ్లు, బట్టలు, బర్రెలు అన్ని కాలిబూడిదైనయ్.
సగం కాలిపోయిన నోట్లు పట్టుకుని మా కుటుంబం మొత్తం బోరున ఏడ్సినం. ఇంక, నా పెండ్లి ఆగిపోయిందనే అనుకున్నా. విషయం తెల్సుకొని మా ఇంటికి వచ్చిన కేసీఆర్ సారు.. మా నాన్నతోని ‘భయపడకుండా పెండ్లి కారెట్లు పంచుకోండి.. అనుకున్న తేదీకే నీ బిడ్డ పెండ్లి నేను చేస్తా’ అని మాట ఇచ్చిండు. సారు సాయంతోని అనుకున్న ముహూర్తానికే, లునావత్ యాకూతోని నా పెండ్లి జరిగింది. అందుకే, నా పిల్లలను చూసినప్పుడల్లా సార్ గుర్తుకు రావాలని ఆయన పేరు వచ్చేలా అబ్బాయికి చంద్రశేఖర్ హుస్సేన్, అమ్మాయికి చంద్రకళ అని పేరు పెట్టుకున్నాం.
నా పెండ్లికి అండగా నిలవడ్డ కేసీఆర్ సారే.. నా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మితోని ఆదుకున్నడు. మా చంద్రకళ పెండ్లి కుదిరినంక ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సారు మమ్మల్ని పిలిపించుకున్నాడు. ‘కేసీఆర్ సారు మీ బిడ్డకు పెండ్లి చేపించమని చెప్పిండు. మేమే పెండ్లి చేస్తామ’ని బాధ్యత తీసుకొని నర్సంపేటలోని ఆయన క్యాంపు ఆఫీసు కాడ పెద్ద ఎత్తున పెండ్లి చేసిండు. నా బిడ్డ పెండ్లి అయితుంటే కేసీఆర్ సారు నా పెండ్లి సమయంలో మా నాన్నతో అన్న మాట యాదికొచ్చింది. ‘కీమానాయక్ నీ బిడ్డ పెండ్లి బాధ్యత నాదే, నీ మనుమరాలికి నేనే పెండ్లి చేసి పంపిస్తాన’ని ఇరవై ఏండ్ల కింద చెప్పిండు. అప్పుడు అన్న మాటను గుర్తు పెట్టుకొని నా బిడ్డకు కూడా పెండ్లి చేసిండు.
కేసీఆర్ సారు మా పెండ్లి ఎప్పుడైతే చేసిండో అప్పటి నుండి నన్నందరు టీఆర్ఎస్ అనే పిలుస్తరు. ఆయన దయతోనే మా పెండ్లయింది. నాకు రెండెకరాల పొలం ఉన్నది. ఒక ఎకరానికి పట్టా అయింది. రైతుబంధు సాయం అందుతున్నది. ఇంకో ఎకరం పట్టా అయ్యేందుకు ములుగు తహసీల్‌ల దరఖాస్తు పెట్టిన. ఇంతలో ఎలక్షన్లొచ్చినయ్. ఈసారి గిన కేసీఆర్ సారే అంతట గెలుస్తడు. నా ఓటైతే కేసీఆర్ సారుకే! గీ సంగతి తెల్సి కాంగ్రెసోళ్లు నన్ను ఓటు అడగరు. నన్ను కేసీఆర్ మనిషి అంటరు.
– లునావత్ యాకు
…? బోయినపల్లి శ్రీధర్‌రావు