ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తు
టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటకు చెందిన సముద్రాల స్వామి, ఆయన కూతురు వెన్నెలకు సంబంధించిన 20 ఎకరాల భూమిని ప్రభుత్వ టెక్స్టైల్ పార్కు కోసం తీసుకున్నారు.
- టెక్స్టైల్ పార్కు భూముల పరిహారం చెల్లింపులో జాప్యం
- కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యమే కారణం
ఖిలావరంగల్, ఏప్రిల్ 4: టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటకు చెందిన సముద్రాల స్వామి, ఆయన కూతురు వెన్నెలకు సంబంధించిన 20 ఎకరాల భూమిని ప్రభుత్వ టెక్స్టైల్ పార్కు కోసం తీసుకున్నారు. ఎకరానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి భూమిలో రోడ్లు వేశారు. అయితే.. నష్టపరిహారం తక్కువగా వస్తుందని పలు మార్లు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే అప్పీల్‌కు వెళ్లాలని సూచించారు.
దీంతో బాధితులు హైదరాబాద్‌లోని ల్యాండ్ అక్విజేషన్ అథారిటీని ఆశ్రయించడంతో.. వరంగల్ భూ నిర్వాసితులకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం, ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేసింది. డబ్బులు చెల్లించకుండా ఆసల్యం చేస్తుండటంతో బాధితులు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారు. అయినా డబ్బులు చెల్లించకుండా జాప్యం చేయడంతోపాటు తమ ఉత్తర్వులను అమలు చేయలేదని భావించిన కోర్టు.. వరంగల్ ఆర్డీవో కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం కోర్టు నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని అక్కడ కోర్టు ఆర్డర్‌ను అంటించారు. అనంతరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఏసీలు, కూలర్లు, ఆర్డీవో వాహనంతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

