స్వరాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టితో తొమ్మిదిన్నరేండ్లలోనే తెలంగాణ జలమాగాణంగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్‌తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం మొదలైంది. మండువేసవిలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్న అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. పాతాళ గంగమ్మ పైపైకి ఉబికివస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి నుంచి గరిష్ఠంగా 400 టీఎంసీలకుపైగా వినియోగించుకునే స్థాయికి ఎదిగామంటే కేసీఆర్ హయాంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు.
KCR | హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చివరి భూముల వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సైతం ప్రాధాన్య క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఒక్క పాలమూరు జిల్లాలోనే నాలుగు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఎనిమిది లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కోయిల్‌సాగర్ ద్వారా 50,250 ఎకరాలకు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.65 లక్షల ఎకరాలకు జీవం వచ్చింది. భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. తద్వారా ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారానే 8 లక్షల ఎకరాలకుపైగా బీడు భూములకు జీవం వచ్చింది.
ప్రాజెక్టులను ఆధునిక సాంకేతిక టెక్నాలజీ దన్నుతో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను, మొబైల్ యాప్‌లను వస్సార్ ల్యాబ్స్ ఇప్పటికే రూపొందించింది. తద్వారా పంప్‌హౌజ్‌లు, జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్‌ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి తదితర సమస్త సమాచారం అంతా ఒకేచోట లభ్యం కావడంతోపాటు నదుల్లోకి వచ్చే, కిందికి విడుదల చేసే నీటి పరిమాణాన్ని అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఈ సిస్టమ్‌లో పొందుపరిచారు. జలాశయాలు, చెరువుల్లో ఎంత నీరు ఉన్నది? ఎంత ఖాళీ ఉన్నది? అన్న సమాచారాన్ని కూడా దీని ద్వారా తెలుసుకునే అవకాశం కలగనున్నది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. పంటల సాగు విస్తీర్ణం… (కోట్ల ఎకరాల్లో)
సాగు విస్తీర్ణం పెరుగుదల 98 లక్షల ఎకరాలు (74.8%)
ఆర్బీఐ నివేదిక ప్రకారం సాగునీటి పారకం (లక్షల ఎకరాల్లో)
పెరిగిన సాగు పారకం 97.48 లక్షల ఎకరాలు (155.99%)
రాష్ట్రంలో 2014-15తో పోల్చితే తొమ్మిదిన్నరేండ్లలో పంటల సాగు భారీగా పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. సుమారు 74.8% పెరుగుదలతో పంటల సాగు విస్తీర్ణం 98 లక్షల ఎకరాలు పెరిగినట్టు వివరించింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ అతి తక్కువ కాలంలో ఇంత భారీ విస్తీర్ణంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన దాఖలాలు లేవు.
ఆర్బీఐ లెక్కల ప్రకారం 2014-15లో రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2022-23లో 2.29 కోట్ల ఎకరాలకు పెరిగింది. కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిందంతా దుష్ప్రచారమేనని ఆర్బీఐ నివేదికతో రూఢీ అయింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తొమ్మిదన్నరేండ్లలో సాగునీటి పారకం 156% పెరిగింది. 2014-15లో కేవలం 62.49 లక్షల ఎకరాలకు నీటి పారకం ఉండగా, 2022-23లో 159.97 లక్షల ఎకరాలకు పెరిగింది.
నాటి సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడమే లక్ష్యంగా రూ.1,64,210 కోట్లు వెచ్చించి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పూర్తి చేశారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. ఫలితంగా ప్రాజెక్టుల వల్ల 17.23 లక్షల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందగా, భూగర్భ జలాలు పెరగడంతో మొత్తంగా 98 లక్షల ఎకరాలు కొత్తగా సాగునీరు అందడం గమనార్హం
గోదావరి బేసిన్: ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయం, శ్రీరాంసాగర్ రెండోదశ, శ్రీరాంసాగర్ వరద కాలువ, బాగారెడ్డి సింగూరు కాలువలు, కుమ్రంభీం, కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలివాగు, గడ్డెన్నసుద్దవాగు, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టు పొడిచిన వాగు, సమ్మకసాగర్ బ్యారేజి (తుపాకులగూడెం)
కృష్ణా బేసిన్: జూరాల కాలువలు, కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, కోయిల్‌సాగర్ తెలంగాణ ఏర్పాటు తరువాత మొదలుపెట్టి పూర్తిచేసిన ప్రాజెక్టులు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, చనాకా కొరాట బరాజ్, సమ్మక్క-సారక్క బరాజ్, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం
తెలంగాణ ప్రాంత నీటి వనరులకు ఆయువుపట్టయిన చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 46,500 చెరువులను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించి, ఇప్పటికే నాలుగు దశల్లో 21,436 చెరువులను పునరుద్ధరించింది. నీటిని ఒడిసిపట్టేందుకు, వృథాను అరికట్టేందుకు వీలుగా వాటిని తీర్చిదిద్దించింది. మరమ్మతులు చేపట్టి, కొత్త తూములను నిర్మించింది. ఫలితంగా 15.05 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగుకిందకు వచ్చాయి. చెరువుల్లోనే 9.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రతి వర్షపుబొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాగుల పునరుజ్జీవ పథకం కింద కృష్ణ బేసిన్‌లోని వాగులపై 188, గోదావరి బేసిన్లో వాగులపై 444 చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
నిర్మించాల్సిన చెక్‌డ్యామ్‌లు మొత్తం 1,200
మొదటి ఫేజ్ః 635, నిధులు రూ.1,975 కోట్లు
సెకండ్ ఫేజ్ః 585 నిధులు: రూ.1,850 కోట్లు
ఫస్ట్ ఫేజ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 400 చెక్‌డ్యామ్‌లు పూర్తయ్యాయి. మిగతావి 80% పూర్తయ్యాయి.
సెకండ్ ఫేజ్ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
మొత్తం చెరువులు 27,625
పునరుద్ధరించినవి 21,436
ఖర్చు 9,155.97 కోట్లు
తొలగించిన పూడిక 2384.35 లక్షల క్యూబిక్ మీటర్లు
పునరుద్ధరించిన నీటి నిల్వ సామర్థ్యం 9.61 టీఎంసీలు
ఆయకట్టు స్థిరీకరణ 15.05 లక్షల ఎకరాలు
చెరువుల కింద కొత్తగా సాగులోకి వచ్చిన ఆకకట్టు 1.05 లక్షల ఎకరాలు
165 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద కొత్తగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమిలో 74% మేరకు బోరుబావుల కిందనే ఉండేది. కాలువల కింద 15%, చెరువులు, ఇతర వనరుల కింద 11% మాత్రమే ఉండేది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ప్రాజెక్టులు కట్టకపోవడం, చెరువులను విస్మరించడంతో భూగర్భజలాలు అడుగంటి పోవడమే కాకుండా కరెంటు కోతలతో తెలంగాణ వ్యవసాయరంగం సంక్షోభానికి గురైంది. పదుల సంఖ్యలో, వందల అడుగుల్లో బోర్లు వేయడం, నీటి ఊటలేక అవి ఫెయిలవడమూ పరిపాటిగా మారింది. నీరున్న చోటైనా బావుల ద్వారా సాగుచేద్దామంటే కరెంటు ఉండేది కాదు. ఏ అర్ధరాత్రి వస్తుందో? ఎన్ని గంటలు ఉంటుందో? ఎప్పుడు పోతుందో? తెలియదు. ఎకరమో, అర ఎకరమో సాగుచేయడమే గగనంగా మారిపోయింది.
రాష్ట్ర ఏర్పాటునాటికి తెలంగాణ వ్యాప్తం గా దాదాపు 20 లక్షల బోరుబావులుండగా, వాటికింద సాగైంది 23 లక్షల ఎకరాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన బహుముఖ జలసంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద కూడా వ్యవసాయం పండుగలా మారింది. మిషన్‌కాకతీయ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానంతో తెలంగాణ అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన కరెంటును అందించడంతో బోర్లు నిండుగా పోస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.1 కోట్ల ఎకరాలు సాగువుతుండగా, అందులో దాదాపు 45 లక్షల ఎకరాలు 30 లక్షల బోర్లు కిందనే సాగువుతున్నాయి.
గోదావరి బేసిన్లో ప్రధాన ప్రాజెక్టులు..