హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉకు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నో నెలలుగా జేఏసీ పోరాడుతున్నా ప్రధాని మోదీకి చీమ కుట్టినట్టు లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో దిగడంతో కేంద్రంలో కదలిక వచ్చిందని ఏపీ యువజన, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ అన్నారు.
గురువారం ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో ఏపీ యువజన, విద్యార్థి జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. అనేక త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉకుపరిశ్రమను మోదీ ప్రభుత్వం అదానీకి కట్టబెట్టే కుట్ర చేసిందని జగదీశ్ దుయ్యబట్టారు. బైలాడీలా గనులను అదానీకి కట్టబెట్టడం వెనుక, విశాఖ ఉకుపరిశ్రమ ప్రైవేటీకరణ వెనుక మోదీ పరివారం పన్నాగాలను కేటీఆర్ బట్టబయలు చేశారని చెప్పారు. ఉకు పరిరక్షణకు బీఆర్ఎస్ నాయకత్వం వహించడానికి కార్యాచరణ సిద్ధమైందని చెప్పారు.
సీఎం కేసీఆర్ వల్లే కేంద్రం యూటర్న్ : జేడీ లక్ష్మీనారాయణ
సీఎం కేసీఆర్ వల్లే వైజాగ్ స్టీలు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ట్వీట్ చేశారు. ‘సీఎం కేసీఆర్ ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అని ట్వీట్ చేశారు.