హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): డిఫాల్ట్ జాబితాలో ఉన్న రైస్ మిల్లులకు పలు సడలింపులు ఇచ్చి, ధాన్యం(సీఎమ్మాఆర్) కేటాయించి మి ల్లులను బతికించాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ యాజమాన్యాల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 400 మిల్లుల వరకు 100శాతం సీఎమ్మాఆర్ సరఫరా పూర్తి చేశాయని, అయితే 25 శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మిల్లులకు పెనాల్టీ, వడ్డీ రద్దు చేసి సీఎమ్మాఆర్ కేటాయించాలని కోరారు. ఈ మేరకు సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞిప్తిచేశారు. లేనిపక్షంలో ఈ మిల్లులు మూతపడటం ఖాయమని, వాటి యాజమాన్యాలు, వాటిలోని ఉద్యోగు లు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని, ఈ మిల్లులకు ధాన్యం కేటాయిస్తే రైతుల సమస్యలు, కొనుగోళ్ల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బడాబాబుల మిల్లులు మినహా మిగిలిన 90శాతం రైస్‌మిల్ ఇండస్ట్రీ కష్టాలు, నష్టాల్లోనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.