Duleep Trophy | ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ.. వెస్ట్ జోన్ స్క్వాడ్‌లో పృథ్వీ షా..!
Duleep Trophy : దేశవాళీ టోర్నీల్లో ఒకటైన దులీప్ ట్రోఫీ (Duleep Trophy) 2026-27 ఆగస్టులో మొదలవ్వనుంది. నిరుడు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షాకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
Duleep Trophy : దేశవాళీ టోర్నీల్లో ఒకటైన దులీప్ ట్రోఫీ(Duleep Trophy) 2026-27 ఆగస్టులో మొదలవ్వనుంది. అంతర్ జోన్ జట్ల మధ్య జరిగే ఈ ఈవెంట్లో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు సారథ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను వెస్ట్ జోన్‌ను నడిపించనున్నాడు. నిరుడు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షాకు స్క్వాడ్‌లో చోటు దక్కింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ జరుగనుంది.
దులీప్ ట్రోఫీ కోసం సోమవారం వెస్ట్ జోన్ సెలెక్టర్లు 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, అతడికి షామ్స్ ములానీ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. దేశవాళీలో దుమ్మురేపే ఖాన్ బ్రదర్స్ సర్ఫరాజ్, ముషీర్ ఖాన్లు స్క్వాడ్‌లోకి రాగా.. ముంబై పేసర్లు తుషార్ దేశ్‌పాండే, శార్తూళ్ ఠాకూర్లు ఎంపికయ్యారు. అయితే.. ఐపీఎల్-19లో గాయపడిన ఆయుశ్ మాత్రేను సెలెక్టర్లు పరిగణించలేదు.
🚨 REPORTS 🚨
Ruturaj Gaikwad has been named the captain of West Zone for the upcoming Duleep Trophy. 🏆
(Source: Devendra Pandey)#Cricket #Ruturaj #India pic.twitter.com/8zrBnR6Vsa
— Sportskeeda (@Sportskeeda) July 20, 2026
వెస్ట్ జోన్ స్క్వాడ్ : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), షామ్స్ ములానీ(వైస్ కెప్టెన్), శార్థూల్ ఠాకూర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, తనుష్ కొతియన్, హర్విక్ దేశాయ్(వికెట్ కీపర్), జైమీట్ పటేల్, ఉర్విల్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్, అటిత్ సేథ్, శివాలిక్ శర్మ, ముకేశ్ చౌదరీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

