FIFA Rankings | విశ్వవిజేతకు అగ్రస్థానం.. ఫ్రాన్స్, అర్జెంటీనా ర్యాంక్ ఎంతంటే..!
FIFA Rankings : ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్(Spain) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ఒడిసిపట్టిన ఆ జట్టు ఫ్రాన్స్(France)కు షాకిస్తూ అగ్రస్థానం కైవసం చేసుకుంది.
FIFA Rankings : ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్(Spain) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ఒడిసిపట్టిన ఆ జట్టు ఫ్రాన్స్(France)కు షాకిస్తూ అగ్రస్థానం కైవసం చేసుకుంది. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో కిలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ మూడో ర్యాంకుకు పడిపోగా.. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా(Argentina) రెండో స్థానం నిలబెట్టుకుంది.
వరల్డ్‌కప్ ముగియడమే ఆలస్యం ఫిఫా ర్యాంకులు ప్రకటించింది. మెగా టోర్నీలో దుమ్మురేపి విజేతగా నిలిచిన స్పెయిన్ నంబర్ 1 స్థానం సాధించగా.. రన్నరప్ అర్జెంటీనా రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో అగ్రస్థానంతో ఆడిన ఫ్రాన్స్ సెమీస్‌లో ఓటమి కారణంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

కాంస్య పోరులో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్ సొంతం చేసుకుంది. బ్రెజిల్ ఐదు, మొరాకో ఆరు స్థానాలు సాధించాయి. పోర్చుగల్, బెల్జియం, నెదర్లాండ్స్, మెక్సికో జట్లు వరసగా 7, 8, 9, 10 ర్యాంకుల్లో నిలిచాయి. ఈసారి వరల్డ్‌కప్‌లో సంచలన ప్రదర్శనతో అర్జెంటీనాకు చెమటలు పట్టించిన కాబో వెర్డే(Kabo Verde) 64వ ర్యాంకుతో మురిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

