హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో చంద్రశేఖర్‌రెడ్డితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని, సుదీర్ఘకాలం ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. తన జన్మదినం
సందర్భంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.