Ravindra Kumar | గురుకులాల పతనానికి సీఎం రేవంత్ రెడ్డే బాధ్యుడు : రవీంద్ర కుమార్
Ravindra Kumar | గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందిందని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్(Ravindra Kumar) ఆరోపించారు. దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో(Devarakonda Minority Gurukula School) నిన్న ముగ్గురు విద్యార్థులు తప్పిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ : గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్(Ravindra Kumar) ఆరోపించారు. దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో(Devarakonda Minority Gurukula School) నిన్న ముగ్గురు విద్యార్థులు తప్పిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే బాధ్యుడన్నారు. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురు కులాలే నిదర్శనం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ అసమర్థత కారణంగా మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లితండ్రులకు అప్పగించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

