హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 28లోగా పోలీస్‌శాఖలో స్పౌజ్ బదిలీలు పూర్తవ్వాలని ఆయా డిపార్ట్మెంట్ల హెచ్వోడీలకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా బుధవారం ఆదేశాలిచ్చారు. జీవో-317కు అనుగుణంగా వేర్వేరు క్యాడర్లలో కేటాయించిన దరఖాస్తుదారుల అభ్యర్థనలను తిరిగి పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.
జీవిత భాగస్వామి, ఆరోగ్య సమస్యల కారణంగా చేసుకున్న బదిలీ దరఖాస్తులు, గతంలో తిరస్కరించిన వాటితోపాటు మిగిలిన కేసులను పరిశీలించి ఖాళీలకు అనుగుణంగా సిఫారసులతో ఈ నెల 15లోగా ప్రభుత్వానికి పంపాలని సూచించారు.