హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : మాదాపూర్‌లో పట్టుబడిన రేవ్ పార్టీ నిందితుల సమాచారం మేరకు ఎస్ఆర్నగర్లోని వెంకట్ బాయ్స్ హాస్టల్‌పై దాడి చేయగా ముగ్గురు డ్రగ్స్ ముఠా నిందితులు పట్టుబడ్డారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.12 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు 250 గ్రాము ల గంజాయి పట్టుబడినట్టు వెల్లడించా రు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.