మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 15: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకట్రావుపేటలోని ఓ ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న గురుకులంలో ఈ నెల 8న వేకువజామున ఎలుకలు దాడిచేయగా విద్యార్థినులకు గాయాలయ్యాయి.
దీంతో గురుకుల సిబ్బంది వారిని మెట్‌పల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా స్పందించలేదు. పక్కనే ఉన్న బియ్యం గోదాం నుంచి ఎలుకలు హాస్టల్ వస్తున్నాయని, ఎలుకల సమస్య తీవ్రంగా ఉందని సిబ్బంది తెలిపారు.