Telangana | మరో సమస్య పరిష్కారం.. రేషన్ డీలర్షిప్ అర్హత వయస్సు పెంపు..
Telangana | హైదరాబాద్ : రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్షిప్ ఇచ్చేందుకు వయస్సు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana | హైదరాబాద్ : రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్షిప్ ఇచ్చేందుకు వయస్సు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం 40 ఏళ్ల వరకు ఉన్నటువంటి వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఎవరైనా డీలర్ చనిపోతే ఆయన కుటుంబంలోని 50 ఏళ్ల వరకు వయస్సు గల వారికి ఆ డీలర్‌షిప్‌ను కేటాయిస్తారు. అయితే డీలర్షిప్ పొందే వ్యక్తికి కచ్చితంగా 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉంది. డీలర్ మరణించిన తర్వాత రెండేళ్లకు ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్షిప్ కేటాయిస్తారు. అయితే డీలర్ మరణించిన వెంటనే సదరు అర్హత వ్యక్తి డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

