హైదరాబాద్ : రాష్ర్ట పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ రేషన్ డీలర్ల అసోసియేషన్, ఉన్నతాధికారులతో ఉచిత బియ్యం పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల పాత బకాయిలు రూ. 56.7 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ చేపడుతామని ప్రకటించారు. గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం కృషి చేస్తామన్నారు. కరోనా వేళ పేదలకు సత్వరమే బియ్యం అందేలా ఏర్పాట్లు చేయాలని డీలర్లను, అధికారులను మంత్రి ఆదేశించారు.
లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు జూన్, జూలై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల రేషన్‌బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు నిన్న మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
నేడు రేషన్ డీలర్ల అసోసియేషన్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
— Gangula Kamalakar (@GKamalakarTRS) June 1, 2021
👉సీఎం కేసీఆర్ గారి ఆదేశలతో రేషన్ డీలర్ల పాత బకాయిలు 56.7 కోట్లు విడుదల
👉గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం క్రుషి
👉త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ
👉కరోనా వేల పేదలకు సత్వరం బియ్యం అందేలా ఏర్పాట్లు@trspartyonline pic.twitter.com/yigSIAExd8