సంగారెడ్డి: సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయితే చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అయితే ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనించిందని తెలిప్పారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు.

గత నెల 24న కూకట్పల్లి జేఎన్టీయూలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో ఆందోళనకు దిగారు. తాము రోజూ తినే ఆహారంలో పురుగులు వస్తుంటే యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీసీ చాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు.
చట్నీలో పరుగులు పెడుతున్న ఎలుక
తెలంగాణ – సుల్తాన్ పూర్ జేఎన్టీయూహెచ్ క్యాంపస్ మెస్‌లో చట్నీలో వచ్చిన ఎలుక pic.twitter.com/6TFen4IYl5
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024