మెహదీపట్నం మే 12 : మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుమారుడు ఆదర్శ్ వివాహం.. నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్ కుమార్తె మౌనికతో ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గ నేతలు సీహెచ్ ఆనంద్ కుమార్‌గౌడ్, జీవన్‌సింగ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.