మోర్తాడ్, నవంబర్ 5: నిజామాబాద్ వాసికి లివర్ క్యాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపోజిట్లపై థాయ్లాండ్తోపాటు స్వదేశంలోనూ పేటెంట్ హక్కులు లభించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వందేండ్లలో ఎవరికీ పేటెంట్ హ క్కులు రాలేదు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్కు చెందిన బాస అశోక్ ఈ ఘనత సాధించిన మొదటివ్యక్తిగా గుర్తింపుపొందడం విశేషం. గతంలో నే థాయిలాండ్లో పేటెంట్ హక్కులు పొందిన అశోక్.. తాజాగా స్వదేశంలో నూ పేటెంట్ హక్కులు పొందడంతో ఉస్మానియా వర్సిటీలో వివిధ విభాగా ల అధిపతులు, ప్రొఫెసర్లు ఆయన్ను మంగళవారం సన్మానించారు. అలాగే పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.