నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి. యూరప్ ఖండానికి చెందిన క్రౌన్ కేన్ అనే పక్షులు రెండు రోజులుగా ఇక్కడి పచ్చిక బయళ్లలో సేద తీరుతున్నాయి.
ఇవి వేసవిలో యూరప్ ఖండం నుంచి వలస వస్తుంటాయని పక్షి ప్రేమికుడు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ క్యాతం సంతోష్ వెల్లడించారు.
– నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి