హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రైతులు తమ భూముల్లో భూసారాన్ని తెలుసుకోవడం కోసం రాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఐఐఆర్ఆర్ సాయిల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ ఎంబీబీ ప్రసాద్‌బాబు తెలిపారు. ఇటీవల రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం క్షీణించడంతోపాటు దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ఐసీఏఆర్(ఐకార్) విభాగం ‘భారతీయ వరి పరిశోధన సంస్థ (ఏఐఆర్ఆర్)” నూతన ఆవిషరణ చేపట్టినట్టు వెల్లడించారు. చిన్న, సన్నకారు రైతుల సౌకర్యార్థం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బ్రజేంద్ర నేతృత్వంలో 13మంది శాస్త్రవేత్తల బృందం ఈ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు.
ఈ కిట్ సహాయంతో రైతు తన భూమిలో పోషక విలువలు, తకువ, మధ్యస్తం, అధికం వంటి అంశాలు సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆవిషరించిన ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందుతుందని తెలిపారు. 25 మట్టి పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న ఈ కిట్ ఖరీదు రూ.800. 50 మట్టి పరీక్షలు చేసే కిట్ రూ.1,800కు అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.