హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో భవనాల నిర్మాణం ఊపందుకున్నది. ఇప్పటికే సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో వారం రోజుల్లో మంచిర్యాల, జగిత్యాల, రామగుండం మెడికల్ కాలేజీ పనులు ప్రారంభం అవుతాయి. ఎనిమిది మెడికల్ కాలేజీల పనులను తనిఖీ చేయడానికి ఈనెలాఖరులో జాతీయ మెడికల్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.