Ranga Reddy District Court | రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు మహిళా న్యాయమూర్తిపై పాదరక్ష విసిరిన ఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం రేపింది. హత్యాయత్నం, మారాణాయుధాల కేసులో నిందితుడు కరణ్‌సింగ్ విచారణ సమయంలో హఠాత్తుగా చెప్పు తీసి న్యాయమూర్తిపై విసిరాడు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన సిబ్బంది, న్యాయవాదులు అతన్ని పట్టుకొని చితకబాదారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి కేసులో రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ నిందితుడు కే వీరరాఘవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది సుంకర నరేశ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కింది కోర్టు అన్యాయంగా రిమాండ్ విధించిందని చెప్పారు.
ఇలా చేయడం ప్రాథమిక హకులకు భంగం కలిగించడమేనన్నారు. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు పోలీసుల వివరణ నిమిత్తం విచారణను 14కు వాయిదా వేసింది. ఈ దాడి కేసులో పోలీసులు గురువారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.