బంజారాహిల్స్, మే 14 : గ్రూప్-1 పరీక్షల్లో తన కోడలితోపాటు, తాను అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవానలి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 14న విలేకరుల సమావేశంలో పాడి కౌశిక్‌రెడ్డి గ్రూప్ -1 పరీక్షలు జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ క్రమంలో రాములునాయక్ కోడలికి ఫస్ట్ ర్యాంక్ రావడం వెనక భారీ కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తమ ప్రతిష్టకు భంగం కలగడంతోపాటు, తమపై నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాములునాయక్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీం తో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి మాట్లాడింది బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోకి రావడంతో బుధవారం కేసును ఇక్కడకు బదిలీ చేశారు.