హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో భారీ కుదుపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతున్నదా? ఆ శాఖలో 2012 తరహా దాడులకు ఏసీబీ వ్యూహ రచన చేస్తున్నదా? సబ్ ఆర్డినేట్లే ‘కలెక్షన్ ఏజెంట్లు’గా నెలవారీ మామూళ్లు, అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఉన్నతస్థాయి అధికారులకు సర్దుబాటు చేస్తున్నట్టు నిజామాబాద్ రైడింగ్‌లో తేలిందా? ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. ఏసీబీ దాడులకు దిగనున్నదా? అంటే రాష్ట్రంలో ఏసీబీ దూకుడు చూస్తుంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
ఇటీవల నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపుదాడుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడులు కేవలం ఒక అధికారి అక్రమాస్తుల గుర్తింపుతో ముగిసిపోలేదని, దీని వెనుక ఉన్న భారీ లంచాల నెట్వర్ను ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. అందుకోసం ఏసీబీ ఒక ప్రొఫార్మా తయారు చేసి, దాని ఆధారంగా వివరాలు కావాలని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖకు లేఖ పంపించింది.
సబ్ ఆర్డినేట్లే ‘కలెక్షన్ ఏజెంట్లు’గా.. నెలవారీ మామూళ్లు, అక్రమ వసూళ్ల వ్యవహారంలో డీసీ, ఏసీలకు సహకరిస్తున్నట్టు ఏసీబీ నిర్ధారించిందని తెలిసింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు వారి కింది స్థాయి ఇన్స్పెక్టర్లు క్రమపద్ధతిలో లంచాలు సర్దుబాటు చేస్తున్నట్టు ఏసీబీ గుర్తించిందని చెప్తున్నారు. ఆదే సిస్టం తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో కొనసాగుతున్నదని ఏసీబీ గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం దుకాణాలు, బెల్టు షాప్‌లు, కల్లు దుకాణాల వసూళ్ల వ్యవహారం బహిరంగంగానే జరుగుతున్నదని ్రఏసీబీ గుర్తించినట్టు సమాచారం. ఏ దుకాణం నుంచి నెలలో ఎంత వసూలైం ది? ఏ స్థాయి అధికారికి ఎంతెంత ముట్టజెప్పారు? ఎక్సైజ్ సీఐ ఎంత దగ్గర పెట్టుకున్నా రు? ఎస్ఐ, కానిస్టేబుళ్లకు ఎంత చొప్పున ఇ చ్చారు? తదితర వివరాల కోసం ప్రత్యేక రికార్డును మెయింటెన్ చేస్తున్నట్టు ఏసీబీ గుర్తించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పద్దుల డైరీ కొనసాగిస్తున్నారని ఏసీబీ నిర్ధారించింది. ఆదా యం అమితంగా ఉండటంతో కొందరు అధికారులు రెండు, మూడు కీలక పోస్టులకు ఇన్చార్జులుగా పోస్టింగ్‌లు తీసుకొన్నారని ఏసీబీ గుర్తించింది. ఆయా పోస్టింగ్‌లు ఎవరెవరు తీసుకొన్నారు? పదేండ్లలో ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారనే వివరాలు ఇప్పటికే ఏసీబీ పూర్తిచేసినట్టు తెలిసింది. ప్రధానంగా నలుగురు కీలక అధికారులను లక్ష్యంగా చేసుకొని వివరాలు సేకరించినట్టు చెప్తున్నారు. ఇటీవల డీసీలు, ఏసీలుగా బదిలీ అయిన అధికారులు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? గతంలో ఎక్కడ పని చేశారు? తదితర వివరాలు కూడా సేకరించినట్టు సమాచారం.
మల్లారెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా జారీ అయిన తాజా అధికారిక నోటీసు ప్రకారం, నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ల ఆర్థిక జాతకాలను ఏసీబీ సేకరిస్తున్నది. ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023’ లోని సెక్షన్ 94/179 కింద జారీ చేసిన ఈ నోటీసులో కేవలం అధికారుల వివరాలే కాకుండా, వారి సమీప బంధువులు, కుటుంబసభ్యుల వివరాలు, వారి పాన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్లు, బ్రాంచ్ వివరాలను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాతోపాటు వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో గతంలో పనిచేసిన పాత అధికారుల కదలికలు, వారి ఆస్తుల బదిలీలపై ఏసీబీ గట్టి నిఘా పెట్టినట్టు చెప్తున్నారు.
గత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు ప్రత్యామ్నాయం అనుకున్న మంత్రులకు ముకుతా డు వేయడానికి ఎక్సైజ్ శాఖను టార్గెట్ చేశా రు. ఏసీబీని ఆశ్రయించి ఊపిరి సలపని దాడు లు చేయించారు. ఈ దాడుల్లో దాదాపు 75% ఎక్సైజ్ అధికారులపై అవినీతి కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కింగ్‌పిన్‌గా ఉన్న బొత్స స త్యనారాయణ, మోపిదేవి వెంకటరమణతోపా టు మరికొందరు నేతలు సైలెంట్ అయిపోయారు. తాజాగా అదే తరహాలో దాడులకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసిం ది. ఏసీబీ నోటీసులు, అకౌంట్ల తనిఖీల ప ర్వం చూస్తుంటే, ఎక్సైజ్ శాఖలో పాత సిండికే ట్ తరహా మూలాలను ఏసీబీ పూర్తిగా గుర్తించే పనిలో పడినట్టు తెలుస్తున్నది.