పైసలిస్తేనే ఫైసలా!.. వైద్యవిద్య డైరెక్టరేట్‌లో అడ్డగోలుగా ఫైళ్ల క్లియరెన్స్!
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి పెచ్చుమీరింది. వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారుల తీరు మారడం లేదు. వైద్యశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో కీలకాధికారులు, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై నీకింత, నాకింత అన్న చందంగా ప్రతి ఫైలుపై డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- గత నెల చివరివారంలో వేగంగా కదిలిన ఫైళ్లు
- ఇష్టారీతిన 50కి పైగా డిప్యుటేషన్లు, విజిలెన్స్ క్లియరెన్సులు
- చక్రం తిప్పిన ఇద్దరు అధికారులు, ఇద్దరు పేషీ సిబ్బంది
- విజిలెన్స్ విచారణ చేయాలని పలువురి డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి పెచ్చుమీరింది. వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారుల తీరు మారడం లేదు. వైద్యశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో కీలకాధికారులు, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై నీకింత, నాకింత అన్న చందంగా ప్రతి ఫైలుపై డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాల్లో వసూళ్ల బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయని సొంత శాఖ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. వైద్యవిద్యకు, బోధనాసుపత్రుల నిర్వహణకు కీలకమైన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో గత నెల 31న విభాగాధిపతి ఉద్యోగ విరమణ పొందారు.
అదే నెల చివరి వారంలో డీఎంఈ పరిధిలో పనిచేసే 20 మందికిపైగా ఉద్యోగులకు హుటాహుటిన డిప్యుటేషన్లు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు 30 మందికి పైగా వైద్యుల విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా డిప్యుటేషన్లకు డిమాండ్ ఉన్నచోటుని బట్టి రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు, వైద్యుల విజిలెన్స్ ఫైళ్ల క్లియరెన్స్‌కు ఒక్కో ఫైలుకు రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకాధికారితో పాటు మరో ముఖ్య అధికారి, ఇద్దరు పేషీ సిబ్బంది చక్రం తిప్పారు. ఇంత హడావుడిగా పెద్దఎత్తున ఫైళ్లను క్లియర్ చేయడం వెనుక భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

