హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికారం కేసులో ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో ఇస్లాం ఫోబియా, ఇస్లాం కొవిడ్ వైరస్ జిహాద్, తబ్లిగీ జిహాద్ వంటి పేర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తులు, ఆయా మీడియా ప్లాట్‌ఫాంలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గతంలో కేంద్రానికి హైకోర్టు సూచించింది.
ఆ ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని పేరొంటూ పిటిషనర్ ఐజాజుద్దీన్ కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం, ప్రతివాదిగా ఉన్న కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులిచ్చి విచారణను వాయిదా వేసింది.