KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రామోజీ రావు ఆకాంక్షించారు. త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం అవుతారని రామోజీ రావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేటీఆర్కు రామోజీరావు లేఖ రాశారు.
కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందన్నారు వైద్యులు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.