హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు చేపట్టిన 48 గంటల దీక్ష మంగళవారం ముగిసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘ఫీజు బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు.
అయితే, సోమవారం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో రాంచందర్రావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావడంతో వెంటనే గ్లూకోజ్ ఎక్కించుకోవాలని పరీక్షలు చేసిన వైద్యులు సూచించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి దీక్ష విరమింపజేశారు.