H-1B Visa | విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే వారిపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు
అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలకునే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలకు తెరలేపింది. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద పని చేసేందుకుగాను, ప్రతి విద్యార్థి తరపున సంబంధిత విశ్వవిద్యాలయం 70 వేల డాలర్లు(రూ. 58 లక్షలకు పైగా) ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమెరికా డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది.
- చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే వారిపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు
- ఓపీటీ కింద పని చేసేందుకు 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన
- రెన్యువల్‌కు మరో 30 వేల డాలర్లు
- విద్యార్థుల తరఫున సంబంధిత యూనివర్సిటీలే చెల్లించాలి
- విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలకునే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలకు తెరలేపింది. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద పని చేసేందుకుగాను, ప్రతి విద్యార్థి తరపున సంబంధిత విశ్వవిద్యాలయం 70 వేల డాలర్లు(రూ. 58 లక్షలకు పైగా) ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమెరికా డిపార్ట్మెంట్ ఆప్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ రెన్యువల్ లేదా పొడిగింపు కోసం అదనంగా మరో 30 వేల డాలర్లు వసూలు చేయాలని ప్రతిపాదనలో పేర్కొంది. విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సుకు సంబంధించిన రంగంలో ఏడాది పాటు పనిచేసేందుకు ఓటీపీ వెసులుబాటు కల్పిస్తున్నది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల విద్యార్థులకు ఈ గడువు మరో రెండేండ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి వచ్చే చవకైన శ్రామిక శక్తిని అడ్డుకొనేందుకే ఈ భారీ ఫీజులను ప్రతిపాదించినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. ఈ ప్రతిపాదన అమెరికాలోని యూనివర్సిటీలు, ఐటీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనపై ప్రజలు 60 రోజులపాటు అభిప్రాయాలు, సలహాలు వ్యక్తం చేయవచ్చు. ఆ తర్వాత డీహెచ్ఎస్ దీనిని తుది నిబంధనగా ఆమోదించి అమల్లోకి తేవచ్చు. అయితే ఉన్నత విద్యా సంస్థలు, లేదా వ్యాపార సంఘాలు ఈ ప్రతిపాదనను కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నది. అలా జరిగితే అమలు ఆలస్యం కావొచ్చు.
హెచ్-1బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడితే 2.4 కోట్ల జరిమానా
అమెరికాలో హెచ్-1 బీ వీసా నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభలో కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి బెత్ వాన్ డ్యూన్ ప్రవేశపెట్టిన ‘హెచ్-1బీ వీసా ఫ్రాడ్ క్రాక్‌డౌన్ యాక్ట్’ ప్రకారం వీసా నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే సంస్థలపై భారీగా జరిమానాలు విధించడంతోపాటు, ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా గరిష్ఠంగా 10 ఏండ్లు నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్థానిక అమెరికన్ కార్మికులను తొలగించి చేసే తీవ్రమైన ఉల్లంఘనలకు విధించే గరిష్ఠ జరిమానా 35 వేల డాలర్లు(సుమారు రూ.3.4 లక్షలు) మాత్రమే ఉండగా, దానిని ఏకంగా ఏడు రెట్లు పెంచి 2 లక్షల 50 వేల డాలర్లు(సుమారు రూ.2.4 కోట్లు) చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. బాధ్యులైన కంపెనీలపై విధించే కనీస నిషేధ కాలాన్ని కూడా మూడేండ్ల నుంచి పదేండ్లకు పెంచాలని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

