అబిడ్స్, డిసెంబర్ 19: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ గణిత శాస్త్ర విభాగాధిపతి, హెచ్‌వోడీ, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కే రమేశ్‌బాబు.. శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్సీ అవార్డు2023కు ఎంపికైనట్టు తెలంగాణ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ్ ముదిరాజ్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ తెలిపారు.
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న ఆయనకు అవార్డు బహూకరిస్తామని వెల్లడించారు. 25 ఏండ్లుగా గణితశాస్త్రంలో ఎనలేని కృషి చేస్తున్న ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రొఫెసర్ బీ లక్ష్మయ్య చేతుల మీదుగా రమేశ్‌బాబు అవార్డు అందుకొంటారని పేర్కొన్నారు.