అశ్వారావుపేట రూరల్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు జిల్లా అధికారులు ఇచ్చిన గడువు పూర్తికావడంతో సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అటవీ, పోలీసులు అధికారులు గిరిజనుల వద్దకు వచ్చి అదనపు కలెక్టర్ సెలవులో ఉన్నారని, మరో రెండురోజుల్లో వచ్చి భూ సమస్యను పరిష్కరిస్తారని అప్పటివరకు ఆగాలని నచ్చచెప్పారు.
ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. ఈ నెల 12న కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లగా అదనపు కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం జాయింట్ సర్వే ప్రారంభిస్తామని చెప్పిన విషయాన్ని గిరిజనులు అధికారులకు గుర్తుచేశారు. మరో రెండ్రోజుల్లో జాయిం ట్ సర్వే ప్రారంభిస్తామని, ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకుందామని అట వీ అభివృద్ధి సంస్థ అధికారి చంద్రకళ చెప్పడంతో గిరిజనులు తిరిగి వెళ్లిపోయారు.