KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఉద్యమ నాయకుడు రుద్ర సముద్రం రామలింగం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాస గృహం నుంచి మౌన యాత్ర ప్రారంభించారు.
మక్తల్, నవంబర్ 16 : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఉద్యమ నాయకుడు రుద్ర సముద్రం రామలింగం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాస గృహం నుంచి మౌన యాత్ర ప్రారంభించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతోపాటు, మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపొందాలని లక్ష్యంతో చేపట్టిన మౌన యాత్రను, సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి రామ్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మక్తల్ నుంచి మౌనయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ యాత్ర 15 నియోజకవర్గాల మీదుగా 600 కిలోమీటర్ల మేరకు 60 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు కేసీఆర్ను కలుసుకొని యాత్ర ముగిస్తామని తెలిపారు. 70 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ఎవరు నుంచి కాలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని అన్నారు. కార్యక్రమంలో మండల మండల పార్టీ మాజీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు చిన్న హనుమంతు, సర్పంచ్ శ్రావణ్ కుమార్, సుధాకర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, అమ్రేష్, మహమూద్ మహమూద్, నరసింహ, శివారెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

