విజయోత్సవ ర్యాలీలపై రాష్ర్ట ఎన్నికల సంఘం నిషేధం
విజయోత్సవ ర్యాలీ | కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా రాష్ర్ట ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో మే 3వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల

హైదరాబాద్ : కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా రాష్ర్ట ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో మే 3వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలపై ఎస్ఈసీ నిషేధం విధించింది. కొవిడ్ దృష్ట్యా ర్యాలీలను నిషేధించినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గెలుపొందిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు ముగ్గురికే మాత్రమే అనుమతిచ్చింది. విజేతతో పాటు మరో ఇద్దరు మాత్రమే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి ధ్రువీకరణ పత్రం పొందాలని ఆదేశించింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు వేసేందుకు వచ్చి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని ఎస్ఈసీ విజ్ఞప్తి చేసింది. ఇక పోలింగ్ సిబ్బందికి మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ అందజేయనున్నారు. ఎన్నికల ముందు రోజు పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయనున్నారు.
ఇవికూడా చదవండి..
కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ.. కానీ పరీక్షలు వాయిదా
కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
కూతురితో మాట్లాడుతున్నాడని కాళ్లు, చేతులు నరికేశారు..
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం : మంత్రి హరీశ్ రావు
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
నోస్టాక్ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం
కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

