OU Doctorate | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో రక్కి శరత్‌బాబు డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ రాధిక పర్యవేక్షణలో ‘ఎ కాంప్రెహెన్సివ్ అప్రోచ్ టు నెట్వర్క్ సెక్యూరిటీ యూజింగ్ స్వార్మ్ ఆప్టిమైజ్డ్ రాండమ్ ఫారెస్ట్ అండ్ సీఎన్ఎన్-ఎల్ఎస్టీఎం విత్ హనీపాట్ టెక్నాలజీ’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి శరత్‌బాబు సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం జేఎన్టీయూ హెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శరత్‌బాబు తన పరిశోధనా క్రమంలో రూపొందించిన పలు పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు అభినందించారు.