తిరుమలాయపాలెం, మార్చి 5: ‘మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారూ.. మా గ్రామం ఆకేరు వరద ప్రవాహానికి గురైన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయం డి’ అంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాశితండా ముంపు బాధితులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు తహసీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘గత వర్షాకాలంలో ఆకేరు ప్రవాహంలో తండా ముంపునకు గురైనప్పుడు ఇచ్చిన హామీకి ఆరు నెలలైందని తెలిపారు.