KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశం ఇచ్చి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
శనివారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ వారిని ఆశీర్వదించారు.