రాజాపేట, సెప్టెంబర్ 24 : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి రాజపుత్రులు సంపూ ర్ణ మద్దతు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని జాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్షత్రియ రాజ పుత్ర వంశీయులు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించుకుం టామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రాజపు త్రులు స్పష్టం చేశారు.