హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 వరకు దరఖాస్తుల గడువు పెంచాలని ఆదేశించారు.
సీఈఐజీలో ఆంధ్రా అధికారి పాగా? ; ఆయన గుప్పిట్లో నాలుగు పోస్టులు
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు ప్రధా న తనిఖీ అధికారి (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్)లో ఆంధ్రా అధికారులు పాగా వేశారు. తెలంగాణ అధికారుల అవ కాశాలను కొల్లగొడుతున్నారు. పైరవీలతో పోస్టులన్నీ వారే ఎగరేసుకుపోతున్నారు. కీలకమైన నాలుగు పోస్టులు ఆంధ్రా అధికారి గుప్పిట్లో ఉండటం గమనార్హం. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ (సీఈఐజీ)గా కొనసాగుతున్న అధికారియే డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ (ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్), డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ జనరల్ రూరల్ (ఉమ్మడి మెదక్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ), డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ జనరల్ నిజామాబాద్ (ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్)కు ఒకే అధికారి కొనసాగుతున్నారు. సదరు అధికారి త్వరలోనే రిటైర్మెంట్కాబోతున్నా రు. సర్కారు పెద్దలను, అధికారులకు మచ్చిక చేసుకుని మళ్లీ అడ్డదారిలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలొస్తున్నాయి. ఇదే సీటుపై మరో అధికారి కన్నేశారు.