హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం ద్వారా రాష్ట్రంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.540 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.