Rajeev Sagar Meday | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసమే తెలంగాణ జాగృతికి పని చేశామని జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ తేల్చిచెప్పారు. 19 ఏండ్లు తమను అన్ని రకాల వినియోగించుకుని, ఇప్పుడు రోడ్డున పడేశారని ఎమ్మెల్సీ కవితపై రాజీవ్ సాగర్ నిప్పులు చెరిగారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాగృతి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. కేసీఆర్కు వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్కు ఆమె వ్యతిరేకం అయ్యారు.. అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామని రాజీవ్ సాగర్ తెలిపారు.
జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తాం.. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పని చేసిన ఎంతో మంది జీవితాలు ఏం అవ్వాలి? 19 సంవత్సరాలు పని చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? కవిత సామాజిక న్యాయం అని అంటున్నారు.. వారికి 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి.. కానీ వారి వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా? అని రాజీవ్ సాగర్ నిలదీశారు.
బీఆర్ఎస్ కోసం పని చేసే తెలంగాణ జాగృతి నాయకులం మేం అని రాజీవ్ సాగర్ స్పష్టం చేశారు. భవిష్యత్లో కూడా కేసీఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే తెలంగాణ జాగృతి.. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారు? అని కవితను మేడే రాజీవ్ సాగర్ నిలదీశారు.
జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తాం.. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పని చేసిన ఎంతో మంది జీవితాలు ఏం అవ్వాలి?
19 సంవత్సరాలు పని చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి?
కవిత గారు సామాజిక న్యాయం అని అంటున్నారు వారికి 2… pic.twitter.com/RdcVXavAbV
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025