Shahar Ki Baat | హైదరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రంలో సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. నగరంలో మౌలిక వసతులు సమకూరాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, స్వచ్ఛత, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కుల అభివృద్ధి, నగర శివారులోని ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయడం అభినందనీయం. సనత్‌నగర్ పరిధిలో అనేక పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. హైదరాబాద్ అంటేనే అన్ని రంగాలతో మిళితమైన అభివృద్ధి.
– గులాబ్‌సింగ్ రాజ్‌పురోహిత్, రాజస్థాన్ ట్రేడర్స్ అసోసియేషన్ నేత