స్టేషన్‌ఘన్‌పూర్/ చిల్పూర్, ఏప్రిల్ 12: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అక్రమాలకు దేవునూరు భూములే సాక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శనివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు నియోజకవర్గం నుంచి 30 వేలకు పైగా జనాన్ని తరలించడానికి ఏర్పాట్టు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎలాంటి హక్కు లేకున్నా రూ.10వేల కోట్లకు 400 ఎకరాల భూములను కుదవపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆయన కంటే నేనేం తక్కవ కాదంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు అటవీ భూములను కబ్జా చేస్తున్నాడని విమర్శించారు.