Rajagopal Reddy | కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Rajagopal Reddy | తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. మునుగోడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. మునుగోడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “కొండా సురేఖకు సంబంధించిన పూర్తి నివేదిక హైకమాండ్ వద్ద ఉంది. పార్టీ తీసుకునే నిర్ణయానికి ఆమె కట్టుబడి ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను కాంగ్రెస్ అధిష్ఠానమే పర్యవేక్షిస్తుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యమని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తన పూర్తి దృష్టి కార్యకర్తల సంక్షేమంపైనే ఉందని పేర్కొన్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

