Raja Singh | నా పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అసత్యప్రచారం చేస్తున్నారు.. సైబర్‌క్రైమ్ పోలీసులకు రాజా సింగ్ ఫిర్యాదు
Raja Singh | తన పేరుతో సోషల్‌మీడియాలో జరుగుతున్న అసత్యప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తన పేరును వాడుకుంటూ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు
Raja Singh | తన పేరుతో సోషల్‌మీడియాలో జరుగుతున్న అసత్యప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తన పేరును వాడుకుంటూ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం పోస్టు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎలాంటి ఖాతాలు లేవని రాజా సింగ్ స్పష్టం చశారు. తనకు కేవలం ఎక్స్(ట్విట్టర్)లో మాత్రమే అధికారిక ఖాతా ఉందని వెల్లడించారు. @TigerRajaSingh ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మాత్రమే తాను అందుబాటులో ఉంటానని.. అందులో చేసే పోస్టులు, ప్రకటనలనే అధికారికంగా పరిగణించాలని సూచించారు. ఇతర సోషల్‌మీడియా వేదికల్లో తన పేరుతో ప్రచారంలో ఉన్న పోస్టులు, అందులోని సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తన పేరుతో నకిలీ ఖాతాలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ ఏసీపీని కోరినట్లు తెలిపారు. ఆ నకిలీ పేజీలను తక్షణమే బ్లాక్ చేసి, నిర్ధారణ లేని వార్తలను తన పేరుతో ప్రచారం చేసే సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
Fake accounts and pages on Facebook and Instagram are spreading false information and making unauthorized comments in my name.
I hereby officially clarify that I do not have any official account on Facebook, Instagram or YouTube. I am available only on X (Twitter) through my… pic.twitter.com/hKezeBLoqq
— Raja Singh (@TigerRajaSingh) May 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

