హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం. అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలి’ అని రాజాసింగ్ అన్నారు.
కాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటూ ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేనున్నారు. కిషన్రెడ్డి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అని, అధిష్ఠానం ప్రకటించడం తరువాయని జోరుగా ప్రచారం జరిగింది. అయితే పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఆర్ఎస్ఎస్తో అనుబంధమున్న రామచంద్రరావు వైపే మొగ్గుచూపింది.