పాస్‌పోర్ట్ పోయిందా?
పోగొట్టుకున్న పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అవస్థలు పడుతున్న వారికోసం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో)లోని గ్రీవెన్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
- తిరిగి పొందడం సులభమే
- దరఖాస్తుదారులకు హైదరాబాద్‌లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): పోగొట్టుకున్న పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అవస్థలు పడుతున్న వారికోసం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో)లోని గ్రీవెన్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఫిర్యాదుల దాఖలుపై అవగాహన కల్పించడం ద్వారా మళ్లీ సులభంగా పాస్‌పోర్టు పొందేందుకు వీలుకల్పిస్తున్నది. దీనిపై ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నవారు తొలుత ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని వివరాలు అందజేయాలన్నారు. స్థానిక పోలీసులు ఆ వివరాలు పరిశీలించి అప్రూవల్ ఇస్తారని, తర్వాత ‘మీ-సేవ’ నుంచి ‘మిస్సింగ్/లాస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్’ను పొందాక స్లాట్ బుక్ చేసుకుని రీఇష్యూ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంచుకున్న స్లాట్ రోజున పీఎస్కే కేంద్రానికి హాజరై సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ‘మీ-సేవ’ నుంచి జారీ అయిన ‘మిస్సింగ్/లాస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్‌ను చూపించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక 7-10 రోజుల్లోపు పాస్‌పోర్ట్ జారీ అవుతుందని వివరించారు. పోగొట్టుకున్న పాస్‌పోర్టు వివరాలు లేనివారు ఆర్పీవో కేంద్రానికి వచ్చి తమ గుర్తింపు కార్డు వివరాలు సమర్పించాలని తెలిపారు. డాటాబేస్‌లో పరిశీలించి సంబంధిత వ్యక్తి పాస్‌పోర్ట్ వివరాలు అందజేస్తారని, వాటి ఆధారంగా ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

