పోగొట్టుకున్న పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అవస్థలు పడుతున్న వారికోసం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో)లోని గ్రీవెన్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
పాస్‌పోర్ట్.. ఇది మన జాతీయతను నిర్ధారించే గుర్తింపు పత్రం. వి ద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారం, వైద్యం తదితరాల కోసం అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.