హైదరాబాద్ : గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. నిన్న రాత్రి హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ( భారత వాతావరణ శాఖ ) వర్ష సూచన చేసింది.
రాబోయే 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులకు, కుంటలకు జలకళ వచ్చింది.