Weather Update | తెలంగాణలో ఈ నెల 9వ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది.
సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. అలాగే, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని చెప్పింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు భూపాలపల్లిలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. అలాగే, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.