హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ) : నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉం దని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఆవర్తనం కొనసాగనున్నదని పేరొం ది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపిం ది. తెలంగాణలో 11, 12న ఉపరిత ల ఆవర్తన ప్రభావం ఉండదని స్ప ష్టంచేసింది. 13న పలు జిల్లాల్లో అ కడకడా తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాం తాల్లో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావర ణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిజామాబాద్లో అత్యధికంగా 35 డిగ్రీలు, మెదక్లో అత్యల్పంగా 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.