ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్, నేరడిగొండ, బజార్ హత్నూర, ముథోల్, సారంగపూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్, సోన్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
అకాల వర్షంతో శనగ, గోధుమ, జొన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులకు జొన్న, గోధుమ పంటలు నేలకొరిగాయి. ఉదయం నుంచి వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.